![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -533 లో.. పెద్దావిడ కేక్ కట్ చేస్తుంది. మా కేక్ మేం తినిపిస్తాం.. మీ కేక్ మీరు తినిపించండి అని సేనాపతి అనగానే కొంపదీసి అందులో ఏమైనా కలిపారా ఏంటని ధీరజ్ అంటాడు. ఒరేయ్ ఎందుకు రా అలా అంటావని ప్రేమ అంటుంది. అప్పుడే భద్రవతి కలుగజేసుకొని ఇప్పుడు ఇందులో ఏదో కలిపామని నీ డౌట్ కదా అని భద్రవతి కేక్ ని తింటుంది. ఏమైనా కలిపితే నాకు ఏమైనా కావాలి కదా.. ఇప్పుడు డౌట్ తీరిందా అని భద్రవతి అంటుంది. మా అమ్మ కోసం ఒక మెట్టు దిగి వచ్చామని భద్రవతి అంటుంది.
రేయ్ చిన్నోడా ఇవన్నీ ఎందుకు పార్టీ అయ్యేవరకు సైలెంట్ గా ఉండండి అని రామరాజు అంటాడు. ఆ తర్వాత పెద్దావిడ అందరికి కేక్ తినిపిస్తుంది. అందరు సరదాగా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. ఈ ఫోటోని మా ఇంట్లో పెట్టుకుంటానని వేదవతి అంటుంది. ఆ తర్వాత అందరు ఒక్కొక్కరిగా డ్యాన్స్ చేస్తారు. సుకన్య కోపంగా బయటకు వెళ్తుంది. తన వెనకాలే తిరుపతి వెళ్తాడు. మీ ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని సుకన్య అనగానే అందరికి నేను చెప్తానని తనని బుజ్జగిస్తాడు తిరుపతి. అప్పుడే వాళ్ళని కామాక్షి, తన భర్త చూస్తాడు.
వాళ్ళ దగ్గరికి వెళ్లి మావయ్య ఇక్కడ ఏదో సీక్రెట్ నడుస్తున్నట్లు ఉందని తిరుపతి చేతికి ఉన్న ఉంగరాలన్నీ కామాక్షి తీసుకొని తన భర్త వేలికి తొడుగుతుంది. మావయ్య నువ్వేం కంగారుపడకు.. మీ పెళ్లి నేను చేస్తానని కామాక్షి అంటుంది. ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని సుకన్యని కామాక్షి అడుగుతుంది. బోలెడు ఆస్తులున్నాయని అబద్ధం చెప్తుంది సుకన్య. మేనకోడలు కట్నం గట్టిగా ఇవ్వాలని అక్కడ నుంచి కామాక్షి వెళ్ళిపోతుంది. నిజంగానే అన్ని ఉన్నాయా అని తిరుపతి అడుగుతాడు. అన్ని ఉంటే నీ వెనకాల ఎందుకు పడతానని సుకన్య అనగానే తిరుపతి ఆశ్చర్యంగా చూస్తాడు. మరొకవైపు ప్రేమ వేరే చీర కట్టుకోవడానికి సెలెక్ట్ చేస్తుంటే ధీరజ్ వచ్చి తనకి చీర గిఫ్ట్ ఇస్తాడు. ప్రేమ కూడా ధీరజ్ కి డ్రెస్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |